తనకంటే ముందే తనువు చాలించాలని.. 

5 Dec, 2021 08:44 IST|Sakshi
లక్ష్మమ్మ(ఫైల్‌), మల్లయ్య(ఫైల్‌)   

అనారోగ్యంతో భర్త.. పురుగుల మందు తాగి భార్య..  

సాక్షి, రాయికోడ్‌(అందోల్‌): తన భాగస్వామికన్నా ముందే తనువు చాలించాలనుకున్న ఓ వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియలు ముగిసి 24 గంటలు గడవకముందే భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషాధ సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం శంశోద్దీన్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శంశోద్దీన్‌పూర్‌ సర్పంచ్‌ బి.నర్సింలు పెద్దనాన్న మల్లయ్యకు వారం క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో ఆస్పత్రికి తరలించారు.

చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌)

భర్త అనారోగ్యాన్ని చూసి తట్టుకోలేక భార్య లక్ష్మమ్మ(75)భర్త కంటే ముందే తనువు చాలించాలని గురువారం పురుగులమందు తాగింది. వెంటనే బీదర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అదే రాత్రి 9.30 గంటలకు మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు పూర్తికాగా రాత్రి 10 గంటల ప్రాంతంలో అనారోగ్యంతో ఉన్న లక్ష్మమ్మ భర్త మల్లయ్య(80) మృతి చెందాడు. వృద్ధ దంపతులిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మమ్మ అంత్యక్రియలు చేసి వెళ్లిన బంధువులు శనివారం సాయంత్రం మల్లయ్య అంత్యక్రియలు జరిపారు. 

చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..)

మరిన్ని వార్తలు