వైరల్‌: నా వద్ద డబ్బుల్లేవు.. నా పుస్తెలమ్మి బతికించండి

27 Apr, 2021 01:57 IST|Sakshi

నా పుస్తెలు అమ్మి.. బతికించండి

వైరల్‌ అవుతున్న కరోనా మృతురాలి వీడియో

సాక్షి, ఖానాపూర్‌: ‘ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. మీ కాళ్లు మొక్కుతా వెంటనే నన్ను మరో ఆస్పత్రికి పంపించండి. నా వద్ద డబ్బుల్లేవు. మెడలో ఉన్న పుస్తెలతాడు అమ్మయినా సరే నన్ను బతికంచండి’అంటూ వేడుకున్న ఆ మహిళను చివరకు కరోనా బలి తీసుకుంది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం బాదన్‌కుర్తి గ్రామానికి చెందిన కందుల శాంత (40) ఆర్థనాదాలు అందర్నీ కన్నీరు పెట్టించాయి.

కరోనాబారిన పడ్డ సదరు మహిళ నిర్మల్‌ ఏరియా ఆస్పత్రిలో చేరింది. అక్కడ వైద్యం సక్రమంగా అందడం లేదని వెంటనే తనను ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి చేర్చాలని వేడుకున్న వీడియో సోషల్‌మీడియాలో చూసిన ప్రతిఒక్కరి హృదయాలను కలిచివేస్తోంది. తన పిల్లలు చిన్నవారని, తనకు కరోనా వచ్చిందని ఎవర్నీ రానీయలేదని, రెండ్రోజులుగా ఇక్కడే ఉన్నా ఆరోగ్యం కుదుటపడడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. చివరకు బాధితురాలిని రిమ్స్‌కి తరలించే సరికి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది.  

చదవండి: (కరోనాతో ప్రపంచదేశాలు గడగడ.. వారి జోలికి మాత్రం పోలేదు)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు