బ్యూటీఫుల్‌.. ఆర్ట్‌ క్యాపిటల్‌ 

24 Nov, 2020 08:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:‌ భారత్‌ నుంచి తొలి ప్రొఫెషనల్‌ స్టోరీ టెల్లర్‌గా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో 2017లో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ స్టోరీ టెల్లింగ్‌ ఫెస్టివల్‌కి వెళ్లానని స్టోరీ టెల్లర్ దీపాకిరణ్ తెలిపారు. ఆ సమయంలో నేను గమనించింది ఏమిటంటే ఇరాన్‌ ప్రభుత్వం కళలకు ఇస్తున్న ప్రాధాన్యం. భావి తరాలకు కళలను ఒక ఉపాధి మార్గంగా మలుస్తున్న తీరు. అంత చిన్న దేశంలో 1000 దాకా కనూన్‌ పేరిట ఆర్ట్‌ సెంటర్స్‌  ఉన్నాయి.  అవి కూడా చాలా పెద్దవి, విశాలమైన స్థలంలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌ వేదికగా స్టోరీ టెల్లర్స్, మ్యుజిషియన్స్, ఆర్టిస్ట్స్‌, సింగర్స్‌.. ఇలా ఏ కళలో రాణించాలనుకున్నా వారికి  ప్రభుత్వమే శిక్షణ ఇస్తుంది. అంతేకాదు ఈ సెంటర్స్‌ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఉద్యోగాలు కూడా ఇస్తుంది.

మ్యూజిక్, పాటలు, పప్పెట్రీ, థియేటర్, క్రాఫ్టస్‌  ఏవైనా నేర్చుకోవాలనుకునే చిన్నారులకు ఈ సెంటర్స్‌లో శిక్షణ పూర్తిగా ఉచితం. ఆర్ట్‌ సెంటర్స్‌ అనే ఆలోచన  చాలా బాగా అనిపించింది. మన దగ్గర హరికథ, బుర్రకథ వంటి కళలు దాదాపు అంతరించిపోయాయి. ఇదే సమయంలో ఇప్పుడు చాలా మంది యువతీ యవకులు ఇరానియన్‌ స్టోరీ టెల్లింగ్‌ని కెరీర్‌గా తీసుకుంటున్నారు. ఆర్ట్‌ నేపథ్యంగా జరిగే కిస్సా గోయె యాన్యువల్‌ ఫెస్టివల్‌కి వచ్చామని చెబితే పెద్ద సూపర్‌స్టార్‌లా ట్రీట్‌ చేస్తారు. మన నగరంలో కూడా ఇలాంటి సెంటర్స్‌ ఏర్పాటైతే ఆర్ట్‌ని కెరీర్‌గా ఎంచుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సిటీ ఆర్ట్‌ క్యాపిటల్‌గా మారేందుకు కూడా అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు