Photo Feature: కెమెరాకు చిక్కిన వేటగాళ్లు

8 Jun, 2021 09:11 IST|Sakshi

సాక్షి, అచ్చంపేట: గత నెల 3, 7 తేదీల్లో పది మంది వేటగాళ్లు నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌లో ఉచ్చులు బిగించి.. అందులో చిక్కిన దుప్పి, సాంబార్‌లను గొడ్డళ్లతో నరికి చంపారు. వాటిని ముక్కలు చేసి తీసుకెళ్లారు. అయితే.. రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బిగించిన కెమెరా ట్రాప్‌లను నెలకొకసారి అధికారులు పరిశీలిస్తుంటారు.

ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం కెమెరా ట్రాప్‌లను పరిశీలిస్తుండగా, అచ్చంపేట గుంపన్‌పల్లికి చెందిన పది మంది వన్యప్రాణుల్ని వేటాడుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. వీరిని అదుపులోకి తీసుకుని ఈనెల 5న అచ్చంపేట కోర్టుకు తరలించగా, సివిల్‌ జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారని రేంజర్‌ మనోహర్‌ తెలిపారు. ఈ చిత్రాలను అటవీ అధికారులు సోమవారం విడుదల చేశారు.

 


చదవండి: కాల్పుల విరమణ దిశగా మావోలు?

మరిన్ని వార్తలు