ఎమ్మెల్సీ కవిత లేఖకు సమాధానమిచ్చిన సీబీఐ.. ఏం చెప్పిందంటే!

6 Dec, 2022 17:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ జవాబు ఇచ్చింది. డిసెంబర్‌ 11న కవితతో సమావేశానికి సీబీఐ అంగీకరించింది. ఈ మేరకు ఈ మెయిల్‌ ద్వారా కవితకు సమాచారం ఇచ్చింది. డిసెంబర్‌ 11న విచారణకు అందుబాటులో ఉండాలని తెలిపింది.  మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనుంది సీబీఐ.

కాగా మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్‌పీసీ కింద సీబీఐ అధికారులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే తాను ఆ రోజు అందుబాటులో ఉండటం లేదని విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐకి లేఖ రాశారు.  ఈనెల 11, 12, 14, 15 తేదీన విచారించేందుకు సమయం కోరారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత సమాచారం మేరకు సీబీఐ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
చదవండి: శంషాబాద్‌కు భారీ ‘తిమింగలం’!


 

మరిన్ని వార్తలు