స్మిత సబర్వాల్ ఇంట్లోకి చొరబాటు.. ఆనందకుమార్‌ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

23 Jan, 2023 13:57 IST|Sakshi

హైదరాబాద్‌: ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి మీద వేటు పడింది. అతడ్ని సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుడికి రెవెన్యూ అధికారులు ఈ ఆదేశాలను అందించనున్నారు.
నిందితులు ఆనంద్, బాబు

మేడ్చల్‌ జిల్లా పరిధిలోని డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌తో పాటు అతని స్నేహితుడు బాబు రాత్రి వేళ స్మిత సబర్వాల్ ఇంట్లోకి ప్రవేశించి హల్‌చల్‌ చేశారు. వీరిని చూసి భయాందోళనకు గురైనట్లు స్మిత సబర్వాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఆనంద్, బాబును పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.

చదవండి: భయానక పరిస్థితిని ఎదుర్కొన్నా 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు