తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన వివరాలు..

12 Nov, 2022 11:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన పొలిటికల్‌ హీట్‌ పుట్టిస్తోంది. ఇప్పటికే మోదీ పర్యటనపై పలు చోట్ల నిరసనలు, నో ఎంట్రీ అంటూ ఫ్లెక్సీలు వంటివి కనిపించాయి. అయితే, ఇదంతా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వ కుట్రగా ఆరోపించింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన ముగించుకుని మధ్యాహ్నానికి తెలంగాణ చేరుకోనున్న మోదీ.. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రానికి సుడిగాలి పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై మోదీ ఎలాంటి కామెంట్స్ చేస్తారనే దానిపై రాజకీయ వర్గాల‍్లో ఆసక్తి  నెలకొంది. 

తెలంగాణలో మోదీ పర్యటన వివరాలు.. 
మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు.  

మధ్యాహ్నం 1.40 నుంచి 2 గంటల వరకు ఎయిర్ పోర్ట్ బయట పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు.  

2.15 గంటలకు రామగుండం బయలుదేరతారు.

3.30 నుంచి 4 గంటలకు RFCL ప్లాంట్ సందర్శిస్తారు.

4.15 నుంచి 5.15 వరకు రామగుండంలో నిర్వహించే సభలో మాట్లాడతారు. 

5.30కు రామగుండం నుంచి బేగంపేట బయలుదేరుతారు మోదీ.

6.35కు బేగంపేట చేరుకుంటారు. 

6.40కి బేగంపేట నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు మోదీ.

ఇదీ చూడండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. 'మునుగోడు' వేడి చల్లారకముందే..

మరిన్ని వార్తలు