బీజేపీలోనే కొనసాగుతా

23 Jul, 2021 02:09 IST|Sakshi

మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ కుమారుడు వీరేందర్‌ గౌడ్‌ స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: తన తండ్రి, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌తో పాటు, తాను కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నామన్న ఊహాగానాలకు బీజేపీనేత తూళ్ళ వీ రేందర్‌గౌడ్‌ తెరదించారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దేవేందర్‌గౌడ్‌ని కలిసిన విషయం తెలిసిందే. గురువారం ఢిల్లీలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లను కలిసిన అనంతరం వీరేందర్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. తన తండ్రిపై ఉన్న గౌరవంతోనే మర్యాదపూర్వకంగా కాంగ్రెస్‌ నేతలు తమను కలిశారని, వేరే పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రకు సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌పై, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై సంజయ్‌తో చర్చించినట్లు వీరేందర్‌గౌడ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు