Dharani Portal: ధరణి వెబ్‌సైట్‌లో కొత్త ఆప్షన్‌లు.. భూ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం!

2 May, 2022 17:18 IST|Sakshi
మోర్తాడ్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో భూములను రిజిస్ట్రేషన్‌ చేస్తున్న తహసీల్దార్‌

మోర్తాడ్‌ బాల్కొండ/నిజామాబాద్‌: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, తక్షణ మ్యుటేషన్‌ కోసం రూపొందించిన ధరణి వెబ్‌సైట్‌లో కొత్త ఆప్షన్లను ఇచ్చారు. ఫలితంగా కొంత కాలంగా పరిష్కారం కాని అనేక సమస్యలకు దారి చూపడానికి అవకాశం ఏర్పడిందని అధికార యంత్రాంగం చెబుతుంది. ధరణి వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర కాలం అవుతుంది. కొన్ని ఆప్షన్లను ఇవ్వడంతో కేవలం డిజిటల్‌ పట్టా పాసు పుస్తకం ఉండి ఎలాంటి తప్పు లు లేని భూమి పట్టా మార్పిడి మాత్రమే జరిగింది.
చదవండి👉 Teenmar Mallanna: బీజేపీకి తీన్మార్‌ మల్లన్న గుడ్‌

పార్ట్‌–బీలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించి పట్టా పాసు పుస్తకాలను జారీ చేయడం, పట్టా మార్పిడి చేయడం వీలు పడలేదు. కొన్ని ఆప్షన్లు ఇచ్చి ప్రధాన ఆప్షన్లను ఇవ్వకపోవడంతో భూముల పట్టా మార్పిడి జరగకపోవడం, వివాదాలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి.

ధరణిలో తాజాగా పాస్‌ బుక్కులలో పేర్ల మార్పు, భూమి స్వభావం, వర్గీకరణ, భూమి రకం, విస్తీర్ణం లెక్కలను సరి చేయడం, మిస్సింగ్‌ సర్వే నంబర్లను గుర్తించి వాటిని ఎక్కించడం, సబ్‌ డివిజన్ల చేర్పు, నేషనల్‌ ఖాతా నుంచి పట్టా భూమి మార్పు, భూమి అనుభవంలో మార్పులకు అవకాశం ఏర్పడింది. ఇలా పలురకాల ఆప్షన్లను ఇవ్వడంతో అనేక సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి మా ర్గం సుగమమైందని తహసీల్దార్లు చెబుతున్నారు.
చదవండి👉🏻 దయాకర్‌కు నోటీసులు.. మదన్‌మోహన్‌కు హెచ్చరిక

కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం 
ధరణిలో ఇచ్చిన కొత్త ఆప్షన్‌లను పరిశీలిస్తున్నాం. గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఎంత మేరకు పరిష్కరించవచ్చో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కొత్త ఆప్షన్‌లతో ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. 
– శ్రీధర్, తహసీల్దార్, మోర్తాడ్‌

మరిన్ని వార్తలు