తెలంగాణలో భూముల ధరల పెంపు ఎఫెక్ట్‌.. ‘ధరణి’ డౌన్‌

28 Jan, 2022 02:08 IST|Sakshi

మొరాయించిన పోర్టల్‌.. తహసీల్దార్‌ కార్యాలయాల్లో నిలిచిన రిజిస్ట్రేషన్లు

మీసేవ కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌ సైతం..

భూముల విలువలు ప్రభుత్వం సవరించనుండటంతో క్రయవిక్రయదారుల పరుగులు..

సర్వర్‌పై భారం పడటంతో సేవలకు అంతరాయం

సాయంత్రం పునఃప్రారంభం.. రాత్రి 10:30 వరకు కొనసాగిన రిజిస్ట్రేషన్లు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రాష్ట్ర వ్యాప్తంగా ‘ధరణి’ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో పాటు మీసేవ సెంటర్లలో స్లాట్‌ బుకింగ్‌లు సైతం నిలిచి పోయాయి. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయే తర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలువలు ఫిబ్రవరి ఒకటి నుంచి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో భూ, ఇతర స్థిరాస్తుల క్రయవిక్రయదారులు తహసీల్దార్, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. 4,5 రోజులుగా ఈ పరిస్థితి నెలకొంది.

అయితే గురువారం పెద్దసంఖ్యలో రిజిస్ట్రేషన్లు ఉండ డం, స్లాట్‌ బుక్‌చేసుకునే వారు సైతం మీసేవ సెంటర్లకు భారీగా తరలిరావడంతో ధరణి సర్వర్‌పై ప్రభావం చూపింది. ఎక్కువ లోడ్‌ పడడంతో సర్వర్‌ మొరాయించినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6:30 తర్వాత ధరణి వెబ్‌సైట్‌ పనిచేయడంతో తహసీల్దార్‌ కార్యాల యాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టగా.. పలు చోట్ల రాత్రి 10:30గంటల వరకు కొనసాగింది.

ఒక్కసారిగా పెరిగిన రిజిస్ట్రేషన్లు.. 
మరో నాలుగు రోజుల్లో వ్యవసాయ, వ్యవ సాయేతర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలు వల సవరణ అమల్లోకి రానుండడంతో ఇప్ప టికే భూములు కొనుగోలు చేసుకుని రిజి స్ట్రేషన్‌ చేసుకోకుండా ఉన్నవారు మీసేవ సెం టర్లకు పరుగులు పెడుతున్నారు. స్లాట్‌ బుకిం గ్‌ల సంఖ్య పెరగడంతో రిజిస్ట్రేషన్, తహసీ ల్దార్‌ కార్యాలయాలు రద్దీగా మారాయి. సాధారణ రోజుల్లో జరిగే రిజిస్ట్రేషన్లకు సుమారు మూడింతలు పెరిగినట్లు తెలుస్తోంది. వచ్చే రెండు, మూడు రోజులు సైతం ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంటున్నారు.

ఇదీ పరిస్థితి
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 12 సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సాధారణ రోజుల్లో 500 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యేవి. గురువారం ఒక్కరోజే 1,290 వరకు కావడం విశేషం.
 ఖమ్మం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజువారీ 72 స్లాట్‌లు బుక్‌ చేస్తుండగా.. అన్ని డాక్యుమెంట్లను అధికారులు రిజిస్ట్రేషన్‌   చేసేవారు. గురువారం 120కిపైగా స్లాట్‌లు బుక్కయ్యాయి.
 కరీంనగర్‌ పట్టణంలో 97 డాక్యుమెంట్లకు సంబంధించి చలాన్లు తీసుకోవడానికి సర్వర్‌ మొరాయించడంతో సుమారు 60 వరకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అలాగే 13 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో 550 రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు సమాచారం. దాదాపుగా 145 మీసేవ కేంద్రాల్లోనూ సర్వర్‌ సమస్యతో స్లాట్‌ బుక్‌కాలేదు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో సైతం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అవాంతరాలు ఎదురయ్యాయి.
 వనపర్తి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 30 – 40 వరకు రిజిస్ట్రేషన్లు అయ్యేవి. గురువారం 200కుపైబడి వచ్చాయి. దీంతో రాత్రి 10.30 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది.

ప్రభుత్వం మరింత సమయమివ్వాలి
రిజిస్ట్రేషన్లకు సంబంధించి చలానా తీద్దామని వెళ్తే సర్వర్‌ మొరాయించింది. మూడు గంటల పాటు ఇబ్బందిపెట్టింది. రేపు చూద్దామని ఇంటికొచ్చేశా. ఆస్తుల విలువలు పెంచేందుకు ప్రభుత్వం మరింత గడువివ్వాలి. ఇలా పెంచుకుంటూ పోతే రిజిస్ట్రేషన్లంటేనే భయపడాల్సిన  పరిస్థితి. 
– వేల్పుల వెంకటేష్, వ్యాపారి, కరీంనగర్‌ (27ఎంబీఎన్‌ఆర్‌ఎల్‌13) 

సర్వర్‌ పనిచేయట్లేదు
ఈ రెండ్రోజులు రైతులు, భూ వ్యాపారులు క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ల కోసం ఎక్కువగా వస్తున్నారు. రెట్టింపు సంఖ్యలో దరఖాస్తుదారులు ఉండడంతో రిజిస్ట్రేషన్ల సర్వర్‌ సరిగా పనిచేయట్లేదు.
– అశోక్, మీసేవ నిర్వాహకుడు, కోడేరు, నాగర్‌కర్నూల్‌ (27ఎంబీఎన్‌ఆర్‌ఎల్‌14)

మరిన్ని వార్తలు