అన్నీ సవ్యంగా ఉంటే అరగంటలో పాస్‌బుక్‌

20 Oct, 2020 10:21 IST|Sakshi

విజయ దశమికి ధరణి

25 నుంచి తహసీళ్లలో సాగు భూముల రిజి్రస్టేషన్లు 

దరఖాస్తు నింపడం, స్లాట్‌ బుకింగ్‌... ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే 

పక్కాగా వ్యవసాయ భూముల రిజి్రస్టేషన్‌ మార్గదర్శకాలు 

సాక్షి, హైదరాబాద్‌: దసరా నుంచి ‘ధరణి’పోర్టల్‌ అందుబాటులోకి రానుంది. కేవలం అరగంటలోపే రిజి్రస్టేషన్‌ ప్రక్రియ పూర్తయి పట్టాదారు పాస్‌పుస్తకం రైతు చేతికందనుంది. రిజి్రస్టేషన్‌ సహా రెవెన్యూ రికార్డుల అప్‌డేషన్, మ్యుటేషన్‌ (హక్కు బదలాయింపు) అక్కడికక్కడే పూర్తి కానున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన భూ హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం–2020తో ఇది సాధ్యం కానుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీళ్లలో చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఆ మేరకు ప్రయోగాత్మకంగా రిజి్రస్టేషన్ల ప్రక్రి యను పరిశీలించింది.

సాంకేతిక సమస్యలను కూడా అధిగమించడంతో విజయదశమి నుం చి తహసీళ్లలో రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా ఊపింది. రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు పూరించ డం నుంచి స్లాట్‌ బుకింగ్‌ వరకు వివిధ దశల్లో సమాచారాన్ని క్రయ, విక్రయదారులు ఆన్‌లైన్‌లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. పారదర్శకంగా, సులభతరంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రి య జరిగేలా, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసే లా రెవెన్యూశాఖ ధరణి పోర్టల్‌ను రూపొందించింది.

డాక్యుమెంట్‌ రైటర్లతో పనిలేకుండా.. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉంటే చాలు స్లాట్‌ బుక్‌ చేసుకొని రిజి్రస్టేషన్‌ కోసం తహసీల్‌కు వెళ్లేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను తీర్చిదిద్దింది. ఆన్‌లైన్‌ పరిజ్ఞానంలేని రైతులు మాత్రం మళ్లీ డాక్యుమెంట్‌ రైటర్లనో, ఈ–సేవ కేంద్రాల్లో వేరే ఎవరి సాయమో పొందాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అంతేగాకుండా రిజి్రస్టేషన్‌ సమయంలో పాన్‌కార్డు నంబర్‌ను నమోదు చేయాలి. లేనిపక్షంలో ఫారం 60, 61 డిక్లరేషన్‌ సమరి్పంచాల్సి వుంటుంది. 

హైదరాబాద్‌ మినహా 570 తహసీళ్లలో 
ఈ నెల 25వ తేదీ నుంచి సాగు భూముల రిజి్రస్టేషన్లు తహసీళ్లలో జరుగనున్నాయి. వారసత్వ బదిలీ, క్రయవిక్రయాలు, భాగపంపిణీ, బహుమతి, కోర్టు డిక్రీ ద్వారా వచ్చే హక్కులకు సంబంధించి రిజి్రస్టేషన్లు తహసీల్దార్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సాగు భూములు లేని హైదరాబాద్‌ జిల్లాను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో ఈ రిజి్రస్టేషన్ల ప్రక్రియను దసరా నాడు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు తహసీల్దార్‌ కార్యాలయాలకు సాంకేతిక, మౌలిక వసతులను కలి్పంచడమే గాకుండా... గత రెండు రోజులుగా రిజి్రస్టేషన్ల నిర్వహణపై తహసీల్దార్లు, నయాబ్‌ తహసీల్దార్లు, ఆపరేటర్లకు శిక్షణ కూడా ఇచి్చంది. 

ప్రమాణపత్రం తప్పనిసరి 
క్రయ, విక్రయదారులిద్దరూ రిజిస్ట్రేషన్‌ సమయంలో ప్రమాణపత్రం (అఫిడవిట్‌) సమరి్పంచాల్సి ఉంటుంది. ఇందులో పరస్పర అంగీకారం మేరకే లావాదేవీలు జరిగినట్లు ఇద్దరు తమ సమ్మతిని తెలియజేయాల్సివుంటుంది. 

క్రయ, విక్రయదారులు చేయాల్సింది ఇది 
► ధరణి పోర్టల్‌లోకి వెళ్లి స్లాట్‌బుక్‌ చేసుకోవాలి. 
► రైతుల మొబైల్‌ నంబర్‌కు వచి్చన ఓటీపీని నమోదు చేయాలి. 
► రిజి్రస్టేషన్‌ దరఖాస్తు పూర్తి చేయాలి.  
► రైతు పాస్‌బుక్‌కు సంబంధించిన సమాచారం, సర్వే నంబర్ల వివరాలు, ఆ భూమి మార్కెట్‌ వ్యాల్యూ, భూమి సరిహద్దులను... ధరణి పోర్టల్‌లోనే దరఖాస్తులో నమోదు చేయాలి.  
► క్రయ విక్రయదారుల పేర్లు, ఆధార్‌ నంబర్, కుటుంబసభ్యుల వివరాలు, వయస్సు, వృత్తి, కులం, పాన్‌కార్డు నంబర్‌ లేదా ఫారం 60, 61, ఇతర వివరాలు ఇంగ్లి‹Ùలో నమోదు చేయాలి.  
► తద్వారా లభించిన వివరాల సంక్షిప్త పట్టిక మేరకు ఈ–చలాన్‌ జనరేట్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే రిజి్రస్టేషన్‌ ఫీజులను చెల్లించాలి.  
► సాక్షుల వివరాలు నమోదు చేయాలి.  
► ఈ అన్ని వివరాలతో రూపొందించిన దస్తావేజును ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అప్పుడు క్రయ, విక్రయదారులు కోరుకున్న సమయం మేరకు స్లాట్‌బుక్‌ అవుతుంది. ఈ మేరకు ధరణిలోనే ఆన్‌లైన్‌ రసీదు కూడా వస్తుంది. దీంతో క్రయ, విక్రయదారుల పని పూర్తవుతుంది.  

రెవెన్యూ అధికారులు ఏం చేస్తారంటే.. 
రసీదు జారీ అయిన వెంటనే రెవెన్యూ అధికారుల పని మొదలవుతుంది.  
డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్‌) లాగిన్‌ ద్వారా... సాక్షుల పరిశీలన, నమోదు పూర్తయిన వెంటనే రిజిస్ట్రేషన్‌ లావాదేవీలకు అవసరమైన అందరి వ్యక్తుల బయోమెట్రిక్, ఫొటోలను డీఈవో ఆన్‌లైన్‌లో తీసుకుంటారు.  
ఆ తర్వాత తహసీల్దార్‌ కమ్‌ జాయింట్‌ సబ్‌ రిజి్రస్టార్‌ లాగిన్‌ ద్వారా ఆ రిజి్రస్టేషన్‌కు సంబంధించిన దరఖాస్తు, స్టాంపు డ్యూటీ వివరాలు, బయోమెట్రిక్, ఈ–చలాన్‌ తదితర వివరాలను పరిశీలించి రిజి్రస్టేషన్‌కు అనుమతి ఇస్తారు.  
తహసీల్దార్‌ అనుమతించిన మరుక్షణమే దస్తావేజుకు నంబర్‌ కేటాయించబడుతుంది. 
మళ్లీ డీఈవో ద్వారా ఎండార్స్‌మెంట్‌ జరుగుతుంది. అప్పుడు సదరు దస్తావేజు స్కానింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియతో రిజి్రస్టేషన్‌ డాక్యుమెంట్‌ తయారవుతుంది. ఈ డాక్యుమెంట్‌ను డీఈవో ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.  
మళ్లీ తహసీల్దార్‌ లేదా జాయింట్‌ సబ్‌ రిజి్రస్టార్‌ తన లాగిన్‌ ద్వారా మ్యుటేషన్, డిజిటల్‌ సంతకం ప్రక్రియను పూర్తి చేస్తారు.  
ఇది పూర్తయిన వెంటనే డాక్యుమెంట్‌ ప్రింట్‌ ఆప్షన్‌ నొక్కడంతో సదరు రిజి్రస్టేషన్‌కు సంబంధించిన కొత్త పాస్‌పుస్తకం వస్తుంది. దీంతో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది.  

మరిన్ని వార్తలు