జో బైడెన్‌తో ధర్మపురి వాసి

7 Nov, 2020 14:27 IST|Sakshi

ధర్మపురి : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు దిశలో ఉన్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జోబైడెన్‌తో ధర్మపురికి చెందిన అర్చకుడు కశోజ్జుల చంద్రశేఖర్‌శర్మ కలిసి ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 2003లో అమెరికాలోని వెల్మింగ్టన్‌ సిటీలోని మహాలక్ష్మీ అమ్మవారి ఆలయానికి జోబైడెన్‌ రాగా.. అక్కడే అర్చకుడిగా ఉన్న చంద్రశేఖర్‌శర్మ ప్రత్యేక పూజలు చేసి నుదుట తిలకం దిద్దారు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం చంద్రశేఖర్‌శర్మ శాన్‌ఫ్రాన్సిస్కోలో హన్మాన్‌ ఆలయం నిర్మించి అక్కడే ఉంటున్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ జో బైడెన్‌కు హిందూ దేవుళ్లపై విశ్వాసం ఎక్కువగా ఉందని, అమ్మవారి కృపతో అధ్యక్షుడిగా గెలుపొందుతారని జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు