Digvijaya Singh: హై ఓల్టేజ్‌ పాలిటిక్స్‌: రాజగోపాల్‌ రెడ్డి ఢిల్లీకి రావాలని ఫోన్‌ కాల్‌.. ఏం జరుగనుంది?

28 Jul, 2022 11:25 IST|Sakshi

Komatireddy Raj Gopal Reddy.. తెలంగాణలో పాలిటిక్స్‌ శరవేగంగా మారుతున్నాయి. పొలిటికల్‌ లీడర్లు పార్టీలు మారుతుండటం రాజకీయంగా ప్రాధానత్యను సంతరించుకుంది. అధికార పార్టీ నేతలతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలు జంపింగ్‌లు చేస్తున్నారు. 

తాజాగా మునుగోడు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్‌ అయిందని తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ మీడియా వేదికగా తెలిపారు. దీంతో, రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారడం రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సైతం పార్టీ నేతల కదిలికలపై ఫోకస్‌ పెంచినట్టు సమాచారం. 

ఇదిలా ఉండగా.. రాజగోపాల్‌ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించే పనిలోపడినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోమటిరెడ్డితో చర్చలు జరపాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. రాజగోపాల్‌ రెడ్డితో చర్చించేందుకు మాజీ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని దూతగా పంపాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. రాజగోపాల్‌ను ఒప్పించే బాధ్యతలను ఉత్తమ్‌కు అప్పగించింది. ఈ క్రమంలో రాజగోపాల్‌ రెడ్డితో ఉత్తమ్‌ శనివారం చర్చలు జరుపనున్నారు. 

మరోవైపు.. రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారుతున్నారన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆయనతో మాట్లాడుతున్నారు. కాగా, గురువారం ఉదయం రాజగోపాల్‌ రెడ్డికి దిగ్విజయ్‌ సింగ్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. రెండు రోజుల్లో ఢిల్లీకి రావాలని కోరారు. పార్టీలో సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చిద్దామని హామీ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: గ్రేటర్‌లోనూ కమలం వల! ఆకర్ష ఆపరేషన్‌

మరిన్ని వార్తలు