భార్య కాపురానికి రావడం లేదని...  దివ్యాంగుడి బలవన్మరణం

8 Dec, 2021 14:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శాలిగౌరారం: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో  ఓ దివ్యాంగుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన  మండలంలోని అడ్లూరులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్లూరు గ్రామానికి చెందిన వరికుప్పల ఉపేందర్‌(35)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం అతడికి భార్యతో పాటూ కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న తనతల్లిగారింటికి ఉపేందర్‌ భార్య వెళ్లింది.

అప్పటినుంచి కాపురానికి రావడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉపేందర్‌ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి వరికుప్పల యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

మరిన్ని వార్తలు