‘దిశ’హత్యాచార ఘటన: పోలీసులు చెప్పిందే నమోదు చేస్తారా? 

30 Sep, 2021 08:14 IST|Sakshi
వీసీ సజ్జనార్‌

ఎన్‌హెచ్‌ఆర్సీ బృందంపై సిర్పుర్కర్‌ కమిషన్‌ అసహనం

రేపు త్రిసభ్య కమిటీ ముందుకు సజ్జనార్‌!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యాచార ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ఏర్పాటు చేసిన బృందంపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ వీసీ సిర్పుర్కర్‌ కమిషన్‌ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఎన్‌హెచ్‌ఆర్సీ డీఐజీ మంజిల్‌ సైనీ, ఇన్‌స్పెక్టర్లు దీపక్‌కుమార్, అరుణ్‌ త్యాగిల విచారణ బుధవారంతో ముగిసింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో మృతదేహాలు పడి ఉన్న తీరు, పోలీసులు ఎక్కడి నుంచి కాల్పులు జరిపారు వంటి కీలక అంశాలను ఘటనాస్థలి నుంచి సేకరించకుండా పోలీసులు చెప్పిన విషయాలు మాత్రమే ఎందుకు నమోదు చేశారని త్రిసభ్య కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
చదవండి: రెండ్రోజుల్లో సజ్జనార్‌ను విచారించనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ 

‘దిశ’నిందితులను పోలీసులు విచారించిన ప్రైవేటు అతిథిగృహం వాచ్‌మెన్, చటాన్‌పల్లికి నిందితులను తరలించిన వాహనాల డ్రైవర్లను కూడా కమిషన్‌ విచారించింది. ఎన్‌కౌంటర్‌ తర్వాత మృతదేహాలకు పంచనామా నిర్వహించిన వైద్యులు, పోలీస్‌ క్షతగాత్రులకు వైద్యం అందించిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యులను కమిషన్‌ నేడు విచారించనుంది. శుక్రవారం  వీసీ సజ్జనార్‌ను విచారించే అవకాశముందని తెలిసింది.
 

మరిన్ని వార్తలు