Disha Encounter: త్రిసభ్య కమిటీకి ‘కేర్‌’ వైద్యుడి వాంగ్మూలం

9 Oct, 2021 07:27 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: ‘దిశ’ఎన్‌కౌంటర్‌లో క్షతగాత్రులైన పోలీస్‌ కానిస్టేబుల్‌ ఏ అరవింద్‌గౌడ్‌కు గచ్చబౌలిలోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స చేసిన కన్సల్టెంట్‌ ఆర్థోపెడిషన్‌ సర్జన్‌ డాక్టర్‌ రాజేశ్‌ రచ్చను వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ శుక్రవారం విచారించింది. కమిషన్‌ తరఫున న్యాయవాది విరూపాక్ష దత్తాత్రేయగౌడ్‌ పలు ప్రశ్నలను సంధించారు. అరవింద్‌ చికిత్స ఫైనల్‌ రిపోర్ట్‌లన్నీ విచారణ అధికారికి ఒరిజినల్స్‌తో సహా సమర్పించామని, తమ వద్ద ఎలాంటి పత్రాలు, డిజిటల్‌ డాక్యుమెంట్లు లేవని రాజేశ్‌ వాంగ్మూలం ఇచ్చారు.
చదవండి: ఐసీయూలో 3 రోజులు.. ఇచ్చింది పారాసెటమాల్‌

మెడికో లీగల్‌ కేస్‌(ఎంఎల్‌సీ)లో కూడా సీటీ స్కాన్‌ కాపీలు ఆసుపత్రి వద్ద ఉండవని స్పష్టం చేశారు. కానిస్టేబుల్‌ అరవింద్‌ గౌడ్‌ గచ్చిబౌలి ఆసుపత్రిలో 2019, డిసెంబర్‌ 6న ఉదయం 10:18 గంటలకు బెడ్‌ నంబర్‌ 11 కేటాయిస్తూ అడ్మిట్‌ చేసుకున్నట్లు ఓపీ రికార్డ్‌లో ఉంది. కానీ, షాద్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి ‘వైద్యం సమాచార లేఖ’ మాత్రం 2019, డిసెంబర్‌ 7న మధ్యాహ్నం 12 గంటలకు చేరింది. ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించగా.. తెలియదని సమాధానమిచ్చారు. అతనికి ఐసీయూలో చికిత్స చేయాల్సినంత గాయాలేవీ కాలేదని చెప్పారు.
చదవండి: ఊరికి వెళ్తుండగా విషాదం.. కారు పల్టీలు కొట్టి..

డిశ్చార్జి సమ్మరీలో ఎక్స్‌రే గురించి ఎందుకు రాయలేదని ప్రశ్నిచగా.. అందులో పేషెంట్‌ చికిత్స తాలూకు అన్ని వివరాలను నమోదు చేయమని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన చెన్నకేశవులు ఎడమ చేతిలో లభ్యమైన కాటన్‌ స్వాబ్‌ను పరీక్షిస్తే నెగెటివ్‌ వచ్చిందని హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ బాలిస్టిక్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వీ వెంకటేశ్వర్లు.. కమిషన్‌ ముందు వాం గ్మూలం ఇచ్చారు. న్యూఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (సీబీఐ) బాలిస్టిక్‌ రిటైర్డ్‌ డైరెక్టర్‌ అండ్‌ హెచ్‌ఓడీ ఎన్‌బీ బర్ధన్‌ను కూడా కమిషన్‌ విచారించింది. కాగా, సైబరాబాద్‌ మాజీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ విచారణ సోమవారానికి వాయిదా పడింది.     

మరిన్ని వార్తలు