దిశ ఎన్‌కౌంటర్‌: హైకోర్టుకు చేరిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక

4 Jul, 2022 15:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిశ ఎన్‌కౌంటర్‌ కేసు హైకోర్టుకు చేరింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్‌కు సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక హైకోర్టుకు చేరింది. దిశ కేసులో ఎమికస్‌ క్యూరీగా దేశాయ్‌ ప్రకాష్‌ రెడ్డిని హైకోర్టు నియమించింది. దిశ కేసు నిందితులది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ కమిషన్‌ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు విచారిస్తుందంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. త్వరగా ఈ కేసు విచారణను పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

కాగా 287 పేజీల కమిషన్‌ నివేదికకు సంబంధించి 57 మంది  సాక్షులను, 10 మంది పోలీసులను విచారించారు. 2019 నవంబర్ 27న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన యువవైద్యురాలు దిశ కనిపించకుండా పోయింది. మరుసటి రోజు ఉదయం చటాన్​పల్లి వద్ద జాతీయ రహదారి పైవంతెన కింద కాలుతూ ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతురాలిని దిశగా తేల్చారు.  2019 డిసెంబర్ 6వ తేదీన దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. షాద్ నగర్‌కు సమీపంలోని చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. 

మరిన్ని వార్తలు