నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పు

4 Jan, 2023 20:53 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ఆస్తులను జప్తు చేయాలని డిస్ట్రిక్ట్‌ అడిషనల్‌ కోర్టు తీర్పునిచ్చింది. ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు నష్ట పరిహారం ఇవ్వాలని 2012లో బాల్కొండ ప్రాంత రైతాంగం కోర్టును ఆశ్రయించగా నష్టపరిహారం కింద బాధితులకు రూ.62,85,180 చెల్లించాలని కోర్టు తీర్పును ఇచ్చింది.

అయితే అధికారులు 51,13,350 మాత్రమే జమ చేశారు. దీంతో రైతులు తిరిగి కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పును అమలు చేయనందున జిల్లా కలెక్టరేట్‌ ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది.  

చదవండి: (వైఎస్సార్‌ పాదయాత్ర దేశ రాజకీయాలలో​ ఓ సంచలనం: భట్టి)

మరిన్ని వార్తలు