మానవత్వం చాటుకున్న జిల్లా జడ్జి..

29 Jul, 2021 07:24 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఆర్థిక ఇబ్బందులతో యాచకురాలిగా మారిన నిరుపేద వృద్ధురాలిపై ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.జి.ప్రియదర్శిని చొరవ చూపించి ఆసరా పింఛన్‌ ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. సిరిసిల్ల పట్టణం శివారు ముష్టిపల్లిలోని చేనేత కుటుంబానికి చెందిన జిందం లక్ష్మీ భర్త నర్సయ్య పింఛన్‌దారుడు. 2018లో భర్త చనిపోవడంతో లక్ష్మీ పింఛన్‌కోసం డీఆర్‌డీవో అధికారులకు దరఖాస్తు చేసుకుంది. నేటికి పింఛన్‌ మంజూరు కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో యాచకురాలిగా మారింది.

ఈ విషయం కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని దృష్టికి రావడంతో  ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల అదనపు జిల్లా జడ్జి జాన్సన్‌కు మంగళవారం ఆదేశాలు జారీచేశారు. జిల్లా జడ్జి ఆదేశాలతో ఫ్రీ లీగల్‌ కేసు నమోదు చేసి డీఆర్‌డీవో అధికారులకు నోటీసులు జారీ చేసి ప్రాథమిక విచారణ జరిపారు. పెన్షన్‌కోసం దరఖాస్తు చేసుకున్న విషయాన్ని తెలిపి లక్ష్మీకి  సంబంధించిన పత్రాలు సేకరించినట్లు అధికారులు వివరించారు. ఈ కేసును ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేశారు.  

మరిన్ని వార్తలు