ఇద్దరికీ వేరువేరు పెళ్లిళ్లు..  ప్రియుడితో​ ఇంటి నుంచి పారిపోయి

26 May, 2022 15:04 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనపోరాటానికి దిగిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం... లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన నరేష్, ఓ యువతి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతికి వేరే వ్యక్తితో పెళ్లి కాగా, నరేష్‌ సైతం మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల సదరు యువతి తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. నరేష్‌తో వారం రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకుంది.

మళ్లీ ఇరువురు లోకేశ్వరం చేరుకుని ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి సదరు యువతి నరేష్‌ ఇంటికి వెళ్లింది. దీంతో నరేష్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. బాధితురాలు అక్కడే మౌనపోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సర్ధిచెప్పి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బుధవారం ఉదయం ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడుతున్నారు.
చదవండి: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. కచ్చితంగా పాటించాల్సిందే!

మరిన్ని వార్తలు