జర జాగ్రత్త.. లాక్‌డౌన్‌ ఎత్తేశారని.. లైట్‌ తీసుకోవద్దు!

19 Jun, 2021 18:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో కరోనాను లైట్‌ తీసుకోవద్దని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌ అదుపులోకి మాత్రమే వచ్చిందని పూర్తిగా అంతమవ్వలేదని చెప్తున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, గతంలో మాదిరిగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర  కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని అంటున్నారు. ఆంక్షలు ఎత్తివేశారని అలక్ష్యం ప్రదర్శిస్తే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ప్రస్తుత కర్తవ్యమని హితవు పలుకుతున్నారు. మరోవైపు కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రజలు  సంపూర్ణ సహకారం అందించాలని, కోవిడ్‌ నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కోరింది.

చదవండి: తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత 
రసవత్తరంగా టీపీసీసీ పీఠం: ఐదుగురిలో ఎవరో..?

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు