ఏ వ్యాక్సిన్‌ మంచిది? గర్భిణులు టీకా తీసుకోవచ్చా? 

25 Apr, 2021 10:22 IST|Sakshi

ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ రెండూ మంచివే. రెంటింటికి తేడా ఏంటంటే.. నిజమైన కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేసి కోవాగ్జిన్‌ తయారు చేశారు. కోవిషీల్డ్‌ రీకాంబినెంట్‌ ఆధారిత వ్యాక్సిన్‌. ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాక్సిన్‌లో అయినా రెండే అంశాలు చూస్తారు. టీకా సరిగా పనిచేస్తుందా? ఎంత రక్షణ ఉంటుంది.. అనేవే ముఖ్యం. కోవిషీల్డ్‌కు అమెరికా, యూకే, ఇండియాలో మూడు ట్రయల్స్‌ జరిగాయి. అన్నింటిలోనూ 80–85 శాతం పైగా సామర్థ్యం ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయి. కోవాగ్జిన్‌కు 80 శాతం వరకు సామర్థ్యం ఉంది. దీనిపై ఇంకా ట్రయల్స్‌ జరుగుతున్నాయి. విదేశీ వ్యాక్సిన్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ముందుగా అందుబాటులో ఏ వ్యాక్సిన్‌ ఉంటే దాన్ని తీసుకుంటే మంచిది. - తూడి పవన్‌రెడ్డి, కన్సల్టెంట్‌ ఫిజీషియన్,సన్‌షైన్‌ ఆస్పత్రి 

గర్భిణులు టీకా తీసుకోకపోవడమే మంచిది. వారిపై కరోనా టీకా ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై ఇంకా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు వెల్లడి కాలేదు. ఇక రుతు క్రమంలో ఉన్న మహిళలు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా, లేదా అన్న అనుమానం చాలా మంది మహిళల్లో వ్యక్తమవుతోంది. సాధారణ రుతుక్రమం సమయంలో మహిళలు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. రుతుక్రమానికి వ్యాక్సిన్‌కు ఎటువంటి సంబంధం లేదు. కానీ బాగా రక్త స్రావం జరిగినప్పుడు, ఆరోగ్యం స్థిరంగా లేనప్పుడు తీసుకోకూడదు. అలాంటప్పుడు రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండి.. సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. – డాక్టర్‌ రజిని, కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్, రెనోవా ఆస్పత్రి 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు