నిమ్స్‌ వైద్యుల నిర్లక్ష్యం.. నో మోర్‌ అని ఒకసారి.. ఆపరేషన్‌ అని మరోసారి.. చివరికి!

30 Dec, 2022 09:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆపరేషన్‌ చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.  గురువారం నిమ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రసూల్‌పురాకు చెందిన  నవాజ్‌(41)ను బుధవారం మధ్యాహ్నం  ఆపరేషన్‌ కోసం తీసుకెళ్లారు. సాయంత్రం ఆపరేషన్‌ సక్సెస్‌ అయిందని చెప్పారు. అయితే రోగిని మాత్రం చూపించలేదు. ఆ తరువాత పేషెంట్‌ క్రిటికల్‌ అని హడావిడి చేశారు. గురువారం తెల్లవారుజామున ఐసీయూకు తరలించారు.  

4.30 గంటలకు నో మోర్‌ అని చెబుతూనే ఉదయం 7.30 గంటల వరకు వైద్యం చేశారు. వైద్యులు చెపుతున్న పొంతలేని సమాదానాలతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు నిలదీయడంతో ఉదయం 8.31 గంటల ప్రాంతంలో మృతి చెందాడని వెల్లడించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగి చనిపోయాడంటూ బాధితుల ఆందోళన వ్యక్తం చేశారు.   గుండెపోటు రావడంతో రోగి చనిపోయాడని నిమ్స్‌ కార్దియోథోరాసిక్‌ విభాగం వైద్యులు పేర్కొంటున్నారు. 
చదవండి: కరో కరో జల్సా.. కరోనా ముప్పుంది తెల్సా..? కొత్త వేడుకల వేళ జాగ్రత్త సుమా..!

మరిన్ని వార్తలు