అభాగ్యురాలికి అన్నీ తానై.. డాక్టర్‌ ఔదార్యం

24 Apr, 2021 09:11 IST|Sakshi
చికిత్స అనంతరం నవ్వుతూ ఇలా.. 

రెండు వారాల పాటు చేరదీసిన అడిషనల్‌ సూపరింటెండెంట్‌ జలజ వెరోనికా 

సాక్షి, హిమాయత్‌నగర్‌: తల్లిదండ్రులు లేరు. అయిన వాళ్లెవరో కూడా తెలీదు. కొద్దిరోజుల క్రితం నగరంలోని పలు రోడ్లపై తిరుగుతూ అపస్మారక స్థితికి చేరుకోవడంతో.. ఓ యువతి(25)ని అక్కడి స్థానికులు ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత ఉస్మానియా వైద్యులు కింగ్‌కోఠి హాస్పిటల్‌కు పంపారు. ఈ నెల 12న యువతిని కింగ్‌కోఠి హాస్పిటల్‌కు తీసుకురాగా.. ఒంటిపై గాయాలు, ఒంటిపై బట్టలు కూడా సరిగ్గా లేవు. ఆమె వద్దకు వెళ్లాలంటేనే సిబ్బంది హడలెత్తారు. ఓ పక్క కోవిడ్‌ వార్డులోని బెడ్‌పై పడుకోబెడితే అక్కడున్న వారు ఇక్కడ వద్దంటూ ఆందోళన చేస్తున్నారు.

దీంతో యువతిని అక్కున చేర్చుకున్న ఆస్పత్రి అడిషినల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జలజ వెరోనికా తన సిబ్బంది సాయంతో యువతికి వైద్యం అందించి శుభ్రంగా తీర్చిదిద్దారు. అనంతరం రెండుసార్లు కోవిడ్‌ టెస్టు చేయగా.. నెగిటివ్‌ వచ్చింది. యువతికి ఎవరూ లేకపోవడంతో ఆమె స్వచ్ఛంద సంస్థల వారికి అప్పగించే యత్నంలో డాక్టర్‌ జలజ వెరోనికా ఉన్నారు. అభాగ్యురాలికి అండగా నిలిచిన డాక్టర్‌ జలజ వెరోనికా, సిబ్బంది, కోవిడ్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ మల్లిఖార్జున్‌ తదితరులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు