ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్‌ 

31 Oct, 2020 08:48 IST|Sakshi
ఆవు పొట్ట నుంచి తీసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు

సాక్షి, పటాన్‌చెరు: అనారోగ్యంతో ఉన్న ఆవుకు ఆపరేషన్‌ చేసిన పశువైద్యులు దాని పొట్టలో నుంచి 80 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు. వివరాల్లోకి వెళితే.. అనారోగ్యంతో ఉన్న 2 ఆవులను జీహెచ్‌ఎంసీ సిబ్బంది 20 రోజుల క్రితం అమీన్‌పూర్‌ గోశాలకు తరలించారు. వాటిలో ఒక ఆవు మూడ్రోజుల క్రితం మృతి చెందగా.. మరో ఆవు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో అమీన్‌పూర్‌ పశువైద్యాధికారి విశ్వచైతన్య ఆ ఆవుకు శస్త్ర చికిత్స చేసి దాని పొట్టలో పేరుకుపోయిన 80 కిలోల ప్లాస్టిక్, కాటన్‌ బట్టలు బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు