గ్రామ సింహాలు.. పరుగో పరుగు 

2 Feb, 2021 10:46 IST|Sakshi

గట్టు (గద్వాల): మండలంలోని పెంచికలపాడులో చౌడేశ్వరిదేవి జాత రను పురస్కరించుకొని సోమవారం గ్రామ సింహాల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 12 గ్రామ సింహాలు పోటీల్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని అక్షాలకు చెందిన రాణి అనే గ్రామ సింహం మొదటి బహుమతి దక్కించుకోగా.. దాత ఆశప్ప రూ.10,016ను అందజేశారు.

అలాగే ఏపీలోని గుడికల్‌కు చెందిన లక్కీ అనే గ్రామ సింహం ద్వితీయ స్థానంలో నిలవగా దాత నర్సింహులు రూ.5,016, ఆత్మకూరుకు చెందిన యువరాజు అనే గ్రామ సింహం తృతీయ స్థానంలో నిలవగా దాత శివప్ప రూ.3,016లను అందజేశారు. కార్యక్రమంలో న్యాయవాది శ్రీదర్శన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ ఆంజనేయులు, రాఘవేంద్ర, హలీంపాష, తిమ్మప్ప, సలీం, మహాదేవప్ప, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు