ట్రంప్‌కు కరోనా : గుండెపోటుతో అభిమాని మృతి

11 Oct, 2020 14:42 IST|Sakshi

సాక్షి, జనగామ : అమెరికా అధ్యకక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వీరాభిమాని బుస్సా కృష్ణ మృతి చెందాడు. ట్రంప్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో నుంచి తీవ్ర మనోవేదనకు గురై ఆదివారం గుండెపోటుతో మృతిచెందినట్లు తెలుస్తోంది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన కృష్ణకు ట్రంప్‌ అంటే ఎనలేని గౌరవం, ప్రేమ. తనమీద ఇష్టంతో ఇంటిముందు ఓ షెడ్డు నిర్మించి అందులో ట్రంప్‌ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. రోజు ఆ విగ్రహానికి పూజలు నిర్వహించి దేవుడాతో సమానంగా కొలుస్తాడు. (ఐ యామ్‌ ఫీలింగ్‌ గ్రేట్‌: డొనాల్డ్‌ ట్రంప్‌)


గత ఫిబ్రవరిలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో భాగంగా.. ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా తన దేవుడిని కలిసే అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. అంతేకాదు ఉపవాస దీక్షలకు కూడా పూనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే గతవారం ట్రంప్‌కు కరోనా పాజిటివ్‌గా తేటడంతో తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురికావడంతో గుండెపోటు వచ్చి ఆదివారం మరణించాడు. కొన్నే గ్రామస్తులు అతన్ని ముద్దుగా కృష్ణా ట్రంప్‌ అని పిలుస్తుంటారని స్నేహితులు చెబుతున్నారు. ట్రంప్ తన కలలోకి వచ్చేవారని.. ఆయన ఫొటో చూసి రోజు మొదలుపెడితే తనకు మంచి జరుగుతుందని.. అందుకే ఆయన్ను పూజిస్తున్నానని బుస్సా కృష్ణ చెబుతుండేవాడు.

మరిన్ని వార్తలు