యశోద నుంచి నిమ్స్‌కు గుండె తరలింపు.. 15 నిముషాలల్లో 11 కి.మీ

15 Sep, 2021 15:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రీన్‌ ఛానల్‌ ద్వారా మలక్‌పేటలోని యశోద ఆసుపత్రి నుంచి పంజగుట్ట నిమ్స్‌కు బుధవారం ప్రత్యేక అంబులెన్స్‌లో గుండెను తరలించారు. నిమ్స్‌ ఆసుపత్రిలో ఓ వ్యక్తికి ఈరోజు వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. రెండు ఆస్పత్రుల మధ్య దూరం 11కి.మీ కాగా కేవలం 15 నిమిషాల్లో అంబులెన్స్ నిమ్స్ ఆసుపత్రికి చేరుకుంది. గుండెను తరలించే క్రమంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అధికారులు, పోలీసులు ముందే ఏర్పాట్లు చేశారు.
చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి

బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తి నుంచి గుండె సేక‌రణ
ఈ నెల 12వ తేదీన గొల్ల‌గూడెం వ‌ద్ద కానిస్టేబుల్ వీర‌బాబు రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. బైక్ అదుపుత‌ప్పి వీర‌బాబు కింద ప‌డిపోవ‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఖ‌మ్మం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ వీర‌బాబు బ్రెయిన్ డెడ్‌కు గురైన‌ట్లు మంగళవారం య‌శోద వైద్యులు ప్ర‌క‌టించారు. కానిస్టేబుల్ గుండె దానానికి ఆయ‌న కుటుంబ స‌భ్యులు ముందుకొచ్చారు. గుండె కోసం జీవ‌న్‌దాన్‌లో 30 ఏళ్ల  వ‌య‌సున్న ఓ పెయింట‌ర్ న‌మోదు చేసుకున్నాడు. దీంతో కానిస్టేబుల్ గుండెను ఆ వ్యక్తికి నిమ్స్ వైద్యులు ఇవాళ అమ‌ర్చ‌నున్నారు. నిమ్స్‌లో గతంలోనూ ప‌లుమార్లు గుండె మార్పిడి శ‌స్త్ర చికిత్సలు జ‌రిగిన సంగతి తెలిసిందే.
చదవండి: వివాదస్పదంగా మారిన యూపీ సీఎం ‘అబ్బాజాన్‌’ వ్యాఖ్యలు 

మరిన్ని వార్తలు