గాడిద పాలకు డిమాండ్‌.. లీటరెంతో తెలుసా?

18 Jul, 2022 04:37 IST|Sakshi
కోహీర్‌లో గాడిద పాలు అమ్ముతున్న బాలాజీ 

సాక్షి, కోహీర్‌(జహీరాబాద్‌): అవును మీరు విన్నది నిజ మే. ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైనను నేమి ఖరము పాలు’ అనే వేమన పద్యంలో మార్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లు అనిపిస్తుంది. మహారాష్ట్రలోని నాందేడ్‌ పట్టణానికి చెందిన బాలాజీ ఆదివారం సంగారెడ్డి జిల్లా కోహీర్‌ పట్టణంలో గాడిద పాలు అమ్ముతూ కనిపించాడు. ఒక చిన్న అమృతాంజనం సీసా పాలు (సుమారు 10ఎంఎల్‌) రూ.100కు విక్రయిస్తున్నట్టు చెప్పాడు.

ధర వింటే మీకు మూర్ఛ వచ్చినట్టయ్యిందా! కానీ గాడిద పాలలో దగ్గు, దమ్ము, మూర్ఛ వంటి వ్యాధులను తగ్గించే శక్తి ఉందని ప్రచారం ఉంది. అందుకే.. లీటరు రూ.10 వేలకు అమ్ముతున్నాడు. ఒకప్పుడు గాడిదను కొనాలంటే రూ.10 నుంచి 15 వేలు పెట్టాల్సి వస్తే, పాలకు డిమాండ్‌ పెరగడంతో ప్రస్తుతం రూ.45 నుంచి రూ.50 వేల ధర పలుకుతోందని కూడా తెలిపాడు.

మరిన్ని వార్తలు