కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి 

6 Aug, 2021 03:32 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేశ్‌ నేత డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ:  కరెన్సీ పై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటో ముద్రిం చాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత డిమాండ్‌ చేశారు. ‘కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి’ జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్‌ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్‌ విగ్రç ßæం ఎదుట ధర్నా జరిగింది. ఇందులో ఇందులో వైఎస్సార్‌ సీపీ ఎంపీ చింతా అనురాధ, ఎంపీ వెంకటేశ్‌ నేత, మాజీ ఎంపీ వీహెచ్, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ నేత మాట్లాడుతూ ఆర్బీఐ సృష్టికర్త డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఫొటో లేకుండా కరెన్సీ నోటు ఉండడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని సాధన సమితికి ఆయన హామీనిచ్చారు.     

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు