తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌’ అమలు చేయాలి 

21 Feb, 2022 06:16 IST|Sakshi
ఈ–శ్రమ్‌ కార్డులను పంపిణీ చేస్తున్న లక్ష్మణ్‌  

సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయకుండా పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దూరం చేస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. ఆయుష్మాన్‌ భారత్‌ అన్ని రాష్ట్రాలలో అమలవుతుంటే తెలంగాణలో అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం చిక్కడపల్లిలో బీజేపీ రాంనగర్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శులు సివేగి బాలు, కె.ఉపేందర్‌ ఆధ్వర్యంలో ఈ–శ్రమ్‌ కార్డులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 300లకు పైగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ కె.రవిచారి, జి.భరత్‌గౌడ్, జైపాల్‌రెడ్డి, సి.పార్ధసారథి, గడ్డం నవీన్, ప్రవీణ్‌ నాయక్, కిరణ్, లోక్యానాయక్, రమణయ్య, సంపత్‌రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు