జీవప్రదాతలు పుస్తకావిష్కరణ

24 Feb, 2022 14:03 IST|Sakshi

జీవన్ దాన్, నిమ్స్ హైదరాబాద్ విభాగంలో, సదాశయఫౌండేషన్ (గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా) ఆధ్వర్యంలో తీసిన జీవప్రదాతలు అనే ప్రత్యేక సంచికను గురువారం ఆవిష్కరించారు. డాక్టర్ స్వర్ణలత (జీవన్ దాన్ ఇంచార్జ్) పుస్తకావిష్కరణ చేశారు. ఈ పుస్తకంలో అవయవ, శరీరదానం గురించి విపులంగా వివరించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా దీటి వెంకటస్వామి (సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబెర్) హాజరయ్యారు.

ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ గత 13సంవత్సరాలుగా చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. 500 నేత్రదానాలు, 70 శరీర, 65 అవయవదానాలు చేయడం అసాధారణమైన విషయమని పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, సెక్రటరీ లింగమూర్తి, సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు