డీఆర్‌డీవో–ఏఎస్‌ఎల్, హైదరాబాద్‌లో 40 అప్రెంటిస్‌లు

20 Oct, 2021 16:29 IST|Sakshi

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో)కు  చెందిన అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ల్యాబొరేటరీ(ఏఎస్‌ఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 40

► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–30, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌–10.

► విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.

అర్హత
► గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్‌: నెలకు రూ.9000 వరకు చెల్లిస్తారు.

► టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్‌: నెలకు రూ.8000 వరకు చెల్లిస్తారు.

► శిక్షణ వ్యవధి: 12 నెలలు

► ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ల్యాబొరేటరీ(ఏఎస్‌ఎల్‌), డీఆర్‌డీవో, కాంచన్‌బాగ్, హైదరాబాద్‌–500058 చిరునామకు పంపించాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► దరఖాస్తులకు చివరి తేది: 02.11.2021

► వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in


యూసీఐఎల్, తుమ్మలపల్లిలో 30 అప్రెంటిస్‌లు

ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మలపల్లిలో ఉన్న యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌).. 2021–22 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 30

► విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్, కార్పెంటర్, మెకానికల్‌ డీజిల్, టర్నర్‌/మెషినిస్ట్‌.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌వీసీటీ) ఉత్తీర్ణులవ్వాలి.

► వయసు: 02.11.2021 నాటికి 18–25ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 02.11.2021

► వెబ్‌సైట్‌: www.ucil.gov.in

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు