తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌

20 Sep, 2021 11:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైట్‌ చాలెంజ్‌ పేరిట రేవంత్‌ రెడ్డి.. కేటీఆర్‌, కొండా విశ్వేశ్వరరెడ్డిలు డ్రగ్స్‌ పరీక్షలు చేయించుకోవాలంటూ సవాలు విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌.. తాను పరీక్షలకు సిద్ధమే అని.. రాహుల్‌ గాంధీ రెడీనా అని ప్రతి సవాలు విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్‌ చట్టపరమైన చర్యలకు సిద్ధం అయ్యారు.
(చదవండి: జైలుకు వెళ్లిన వ్యక్తి.. సీఎంను తిడతాడా?)

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ‘‘నాపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేశాను. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాను. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేరస్థులకు తగిన శిక్ష పడాలి’’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 
(చదవండి: బెదిరిస్తే.. భయపడేదే లేదు: రేవంత్‌రెడ్డి )

చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి 

మరిన్ని వార్తలు