రిసెప్షన్‌ ఫంక్షన్‌: నూతన దంపతులపై కేసు 

28 May, 2021 14:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దుబ్బాకలో చోటు చేసుకున్న సంఘటన

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురి సహా మరో 10 మందిపై కేసు నమోదు

తొగుట(దుబ్బాక): తొగుట మండలం చందాపూర్‌లో లాక్‌డౌన్, కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి రిసెప్షన్‌ నిర్వహించిన పది మందిపై గురువారం కేసు నమోదు చేసినట్టు తొగుట ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో పెళ్లి రిసెప్షన్‌ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై, పోలీసులు సిబ్బంది అక్కడికి వెళ్లారు. రిసెప్షన్‌ నిర్వహించుకుంటున్న పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురుతోపాటు మరో పది మందిపై కేసు నమోదు చేశామన్నారు. 

నూనె మహేశ్‌ (26) ఎ1, నూనె మౌనిక (25) ఎ2, టెంట్‌ హౌజ్‌ నిర్వాహకుడు నర్సెట్టి ఎల్లం (28) ఎ3, ఆత్మకూరి శ్రీనివాస్‌ (35) ఎ4, పాడలా విజయ (28) ఎ5, నూనె సుబధ్ర (60) ఎ6, జనగామ సుభాష్‌గౌడ్‌ ఎ7. బొడ్డు స్వామి (38) ఎ8, బొడ్డు భూమయ్య (42) ఎ9, నర్సెట్టి సురేష్‌ (35) ఎ10  పై క్రైం నంబర్‌ 82/2021 యూ/ ఎస్‌ 341, 186, 188, 269 మరియు డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లిళ్లు తప్ప రిసెప్షన్, పుట్టిన రోజు ఇతర ఫంక్షన్‌లకు ఎలాంటి అనుమతి లేవన్నారు. లాక్‌డౌన్‌ మరియు కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి ఫంక్షన్‌లు చేసుకునే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

చదవండి: పెళ్లైన గంటల వ్యవధిలో వరుడి అరెస్ట్‌.. కారణం ఏంటంటే

మరిన్ని వార్తలు