హరీష్ రావు అంటే తెరిచిన పుస్తకం

28 Oct, 2020 21:03 IST|Sakshi

సిద్దిపేట : దేశంలో రైతులు 24 గంట‌ల ఉచిత క‌రెంటు ఇచ్చింది కేసీఆర్ మాత్ర‌మేన‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. దుబ్బాక మండ‌లం గుండ‌వెళ్లి ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్షాల‌పై విమర్శ‌లు గుప్పించారు.  కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నారా అంటూ ప్ర‌శ్నించారు. కాలిపోయే మోటర్లు.. బాయికాడ మీటర్లు.. 24 గంటల ఉచిత కరెంటుకు పోటీ.. ఎటుండాలో మీరే తేల్చుకోండి అంటూ ఓట‌ర్ల‌కు పిలుపునిచ్చారు.  (నా తోబుట్టువు సుజాత అక్కని గెలిపిద్దాం: హరీష్‌ రావు )

మార్కెట్లను ప్రైవేటు చేయబోతున్నారని, అలాంటి బిల్లుకు వ్యతిరేకంగా రేపు పోరాటం చేస్తామ‌ని హ‌రీష్ అన్నారు.  గుండవెళ్లి గ్రామంలో అన్ని కుల సంఘాలకు భవనాలు కట్టిస్తామ‌ని, అక్క‌డి గ్రామ ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.  కాల్వల కింద భూములు కోల్పోయిన రైతులకు రూపాయి తక్కువలేకుండా సిద్దిపేట తరహా ఇస్తామ‌న్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసే ఆరోప‌ణ‌లు, స‌వాళ్ల‌కు తాను భ‌య‌ప‌డ‌న‌ని అన్నారు.  'హరీష్ రావు అంటే తెరిచిన పుస్తకం లాంటిది. నన్ను తిట్టిన మీకు, మీ విజ్ఞతకే వదులుతున్న‌.  మీకే నాలుగు ఓట్లు తక్కువైతాయి' అని హ‌రీష్ ప్ర‌సంగంలో పేర్కొన్నారు. (కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో ఓట్లు లెక్కిస్తారేమో : విజయశాంతి )

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు