కరోనా: ఈ నెల 24 వరకు కొన్ని ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

21 Jan, 2022 12:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి విస్తరణ ఉధృతంగా కొనసాగుతోంది.  దేశంలో  నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య మూడు లక్షలను దాటేసిన కొత్త కేసుల సంఖ్య 3,47,254గా ఉంది.  ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య  రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది.  ఉభయ తెలుగు  రాష్ట్రాల్లో జనవరి  ఈ నెల 21 నుండి 24 వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసింది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. క్రితం రోజు మూడు లక్షలు దాటేయగా 24 గంటల వ్యవధిలో మరింత  పెరిగాయి. దేశంలో పాజిటివిటీ రేటు 17.94 శాతానికి ఎగబాకింది. కేసుల పరంగా తెలంగాణాలో రోజుకు నాలుగువేలకు పైగా, ఏపీలో 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  దాదాపు 1.40 లక్షల కేసులతో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ ఒమిక్రాన్ బారినపడిన వారి సంఖ్య 9,692కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు