సెల్లార్‌లోనే చిక్కుకొని హైకోర్టు ఉద్యోగి మృతి

10 Oct, 2020 08:50 IST|Sakshi

హైదరాబాద్ : నిన్న సాయంత్రం భారీగా కురిసిన వర్షాలతో ముషీరాబాద్‌లో ఓ వ్యక్తి మృతి చెందారు. వివ‌రాల ప్ర‌కారం భారీ వ‌ర్షాల కార‌ణంగా ముషీరాబాద్ కేర్ ఆస్పత్రి ఎదురుగా సికింద్రాబాద్ కోపరేటివ్ బ్యాంకు బుడగల అపార్ట్‌మెంట్‌లోకి  భారీగా వ‌ర్షం నీరు వ‌చ్చి చేరింది. అయితే ఆ స‌మ‌యంలో రాజ్‌కుమార్ (54) అనే వ్య‌క్తి సెల్లార్‌లోనే చిక్కుకొని ఉండ‌టంతో ప్రాణాలు కోల్పోయారు. ఈయ‌న హైద‌రాబాద్ హైకోర్టులో ప‌నిచేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాలికతో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత నెల 20న కురిసిన భారీ వర్షానికి సరూర్‌నగర్‌ చెరువులో పడి ఒకరు మృతి చెందారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న బాలాపూర్‌ మండలం అల్మాస్‌గూడకు చెందిన నవీన్‌కుమార్‌ (3) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. సెప్టెంబర్‌ 17న జరిగిన మరో ప్రమాదంలో నేరెడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కాకతీయ నగర్‌లో నివాసముండే  12 ఏళ్ల సుమేధ సైకిల్‌ తొక్కుకుంటూ బయటికెళ్లి ప్రమాదవశాత్తూ ఓపెన్‌ నాలాలో పడిపోవడంతో ప్రాణాలు విడిచింది. (నీట మునిగిన హైదరాబాద్)

మరిన్ని వార్తలు