తెలంగాణలో వరి సాగే అత్యధికం

2 Sep, 2022 02:43 IST|Sakshi

వానాకాలంలో 58,28,686 ఎకరాల్లో నాట్లు 

48,95,905 ఎకరాలకే పరిమితమైన పత్తి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వానాకాలం సాగు 1.28 కోట్ల ఎకరాలకు చేరింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 58,28,686 ఎకరాల్లో వరి నాట్లు వేసినట్టు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి గురువారం అందచేసిన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది 45 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా, అదనంగా మరో 13.28 లక్షల ఎకరాలు ఎక్కువే వరినాట్లు వేశారు.

దీంతో ఈ వానాకాలంలో అన్ని పంటల కంటే వరి సాగు అత్యధికంగా జరిగినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తరువాత పత్తి 48,95,905 ఎకరాల్లో సాగైంది. వానాకాలంలో అత్యధికంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాల ని సర్కారు నిర్ణయించింది. రైతులు సైతం పత్తి సాగుకు మొగ్గు చూపినా ఈ జూలై, ఆగసులో కురిసిన భారీ వర్షాలతో పంట నష్టంతో పాటు మళ్లీ సాగుచేయలేని పరిస్థి తి ఏర్పడింది. దీంతో పత్తిసాగు తగ్గింది.   

మరిన్ని వార్తలు