ఆయిల్‌ఫెడ్‌ ఉద్యోగులకు బోనస్‌ ఎత్తివేత!

14 Oct, 2021 08:25 IST|Sakshi

ఆవేదన చెందుతున్న ఉద్యోగులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌లో దసరా సందర్భంగా ప్రతీ ఏడాది ఇచ్చే బోనస్‌ను రద్దుచేశారని ఉద్యోగులు, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 ఏళ్లకుపైగా ఆనవాయితీగా వస్తున్న బోనస్‌ను ఒక ఉన్నతాధికారి నిర్వాకంతో ఎత్తివేశారని ఆరోపిస్తున్నారు. కొత్తగా లక్షలాది ఎకరాల పామాయిల్‌ విస్తరణలో పాలుపంచుకుంటున్నామని అయినా తమను నిరాశపరిచేలా బోనస్‌ ఎత్తివేయడం సమంజసం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎండీ, చైర్మన్లతోనూ తాము చర్చించామని ఓ అధికారి పేర్కొన్నారు.

కాగా, ఈ విషయంపై ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, బోర్డు సమావేశంలో బోనస్‌ ఇవ్వాల్సిన అవసరమేంటన్న అభిప్రాయం తలెత్తిందని, ఇతర సంస్థల్లో లేనిది ఎందుకు ఇస్తున్నారన్న చర్చ జరిగిందన్నారు. దీంతో బోనస్‌ విషయాన్ని పెండింగ్‌లో పెట్టారని వివరించారు. దీనిపై వ్యవసాయ శాఖ కార్యదర్శి దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. అయినా ఈ వ్యవహారం ఇంకా పెండింగ్‌లోనే ఉందన్నారు. తాము బోనస్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతామని, లాభాల్లో ఉన్నందున ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాల్సిన అవసరముందని రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.   
 

మరిన్ని వార్తలు