Dussehra: తెలుగు లోగిళ్లలో దసరా కళ

15 Oct, 2021 09:35 IST|Sakshi

దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా పండుగ కళ సంతరించుకుంది. పసుపు పచ్చని పూలు,  పచ్చని మామిడాకుల తోరణాలతో  సరదాల దసరా మహోత్సవాల సందడి నెలకొంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి నుంచి మమ్ములను కాపాడు తల్లీ అంటూ దేవీనవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అమ్మవారిని వేడు కుంటున్నారు. అటు గత రెండేళ్లుగా స్తబ్ధుగా ఉన్నా ఈ ఏడాది బతుకమ్మb సంబురాలు కాస్త పుంజుకున్నాయి. పోయిరా బతుకమ్మా .. మళ్లీ రా బతుకమ్మా అంటూ తెలంగాణా ఆడబిడ్డలు బతుకమ్మ ఆటపాటలు, ఊరేగింపులతో సందడి సందడి చేశారు. జగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటూ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.

మరిన్ని వార్తలు