ఖమ్మంలో ఈ–ఓటింగ్‌ అంతంతే

21 Oct, 2021 16:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అట్టహాసంగా చేపట్టిన ఈ–ఓటు మొబైల్‌ యాప్‌ ప్రయోగం ఖమ్మం కార్పొరేషన్‌లో పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. దేశంలోనే తొలిసారిగా ఖమ్మంలో మొబైల్‌ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ఈనెల 8 నుంచి 18 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. అయితే, ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా పాలనాయంత్రాంగం యాప్‌పై ఓటర్లలో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్‌ చేయించడంలో నిర్లక్ష్యం వహించింది.

అధికారులు 10 వేల మంది ఓటర్లతో యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా 38.3 శాతం మంది అంటే 3,830 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. బుధవారం నిర్వహించిన మాక్‌ ఈ–ఓటింగ్‌లో 2,128 మంది మాత్రమే ఓటేశారు. అంటే ఈ–ఓటింగ్‌ 55.56 శాతం నమోదైంది. (చదవండి: కరోనా ఎండమిక్‌ స్టేజ్‌కు చేరుకుంటున్నట్టేనా?)

మరిన్ని వార్తలు