ఎన్నికల కసరత్తు షురూ

22 Sep, 2020 14:29 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ సమాయత్తమవుతోంది. కరోనాతో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించాలా లేక ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల (ఈవీఎం)ల ద్వారా నిర్వహించాలా.. అన్న అంశంపై అభిప్రాయం చెప్పాలని ప్రధాన రాజకీయ పక్షాలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి సోమవారం లేఖలు రాశారు. ఈ నెలాఖరులోపు తమ అభిప్రాయాన్ని చెబితే.. మెజారిటీ అభిప్రాయం మేరకు ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అన్ని ఎన్నికలు ఇప్పటి వరకు బ్యాలెట్‌ పద్ధతినే నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ ఎన్నికలను అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎంలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో విడతల వారిగా సమావేశం నిర్వహించారు. మరోవైపు గ్రేటర్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు