డీసీహెచ్‌ఎల్‌ ఆస్తుల అటాచ్‌

17 Oct, 2020 02:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌)కు చెందిన రూ.122.15 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. ప్రీవెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ)– 2002 ప్రకారం బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, గుర్గావ్, చెన్నై తదితర ప్రాంతాల్లో ఉన్న 14 స్థిరాస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఇవి డీసీహెచ్‌ఎల్‌ ప్రమోటర్లు టి.వెంకటరాం రెడ్డి, టి.వినాయక్‌ రవిరెడ్డి వారి బినామీ కంపెనీకి చెందినవని ఈడీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఇది రెండో అటాచ్‌మెంట్‌ కావడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు అటాచ్‌ చేసిన ఆస్తుల విలువ రూ.264.56 కోట్లకు చేరింది. 

>
మరిన్ని వార్తలు