ED Raids Telangana: గ్రానైట్‌ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన

11 Nov, 2022 15:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రానైట్‌ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. శ్వేత గ్రానైట్స్‌, శ్వేత ఏజెన్సీస్‌, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్‌, పీఎస్‌ఆర్‌ గ్రానైట్స్‌, అరవింద్‌ గ్రానైట్స్‌, గిరిరాజ్‌ షిప్పింగ్‌ ఏజెన్సీస్‌లో రెండు రోజులు సోదాలు జరిపినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌, కరీంనగర్‌లోని పలుచోట్ల సోదాలు చేసినట్లు పేర్కొంది. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ సోదాలు నిర్వహించింది.

రాయల్టీ చెల్లించిన దానికంటే ఎక్కువ గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు ఈడీ గుర్తించింది. సోదాల్లో రూ.1.8 కోట్ల నగదు ఈడీ సీజ్‌ చేసింది. ఉద్యోగులతో బినామీ అకౌంట్లు తెరిచినట్లు అధికారులు గుర్తించారు. పదేళ్లుగా భారీగా హవాలా లావాదేవీలు జరిపినట్లు తేలింది. చైనా, హాంకాంగ్‌కు చెందిన కంపెనీల పాత్రపై ఈడీ ఆరాతీసింది. ఎలాంటి పత్రాలు లేకుండా చైనా సంస్థల నుంచి నగదు మళ్లించడాన్ని గుర్తించినట్టు ఈడీ వెల్లడించింది.
చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే

మరిన్ని వార్తలు