రూబీ లాడ్జ్‌: ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య.. ఫైర్‌ అధికారి కీలక వ్యాఖ్యలు

13 Sep, 2022 07:44 IST|Sakshi

సాక్షి, రాంగోపాల్‌పేట్‌: సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జ్‌లో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరినట్టు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందినట్టు తెలుస్తోంది. 

అయితే, ఈ ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇక, లాడ్జీ లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే దారి ఉంది.  దీంతో లాడ్జీలో ఉన్న వారంతా మెట్ల మార్గంలో కిందకు రాలేకపోయారు. దట్టమైన పొగ కారణంగా హైడ్రాలిక్‌ క్రేన్ సాయంతో​ భవనం ఉన్న 9 మందిని కాపాడినట్టు తెలిపారు. మరోవైపు.. ఘటన స్థలానికి క్లూస్‌ టీమ్‌, స్థానిక తహసీల్దార్‌ కూడా చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న కారణాలపై విశ్లేషిస్తున్నట్టు తెలిపారు.

ఇక, ఈ ప్రమాదంలో స్పాట్‌లోని ముగ్గురు చనిపోగా, ఆసుపత్రికి తరలిస్తుండగా నలుగురు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. కాగా, మృతదేహాలు గాంధీ ఆసుప్రతిలో ఉండగా.. మరికొందరు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇక, మృతుల్లో విజయవాడకు చెందిన హారీశ్‌, ఢిల్లీకి చెందిన వీరేందర్‌, చెన్నైకి చెందిన సీతారామన్‌, పలువురు ఉన్నారు. 

కాగా, ఈ ప్రమాదం అనంతరం పోలీసులు.. రూబీ లాడ్జీని సీజ్‌ చేశారు. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వ్యాపారి రంజిత్‌ సింగ్‌పై సెక్షన్‌ 304ఏ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై మూడు బృందాలు దర్యాప్తు చేపటినట్టు తెలిపారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

హోటల్‌లో బస చేసిన కొందరి పేర్లు ఇవే.. 

1) అబ్రహం వాల్తాలా

2) ఆర్త్ పటేల్

3)  మహేందర్ సింగ్ భట్

4) అశ్వని శిలా

5) ఠాకూర్

6) పృథ్వీరాజ్

7) చందన్ ఈతి

8) అషోత్ మామిదువాట్

9) దేబాషిస్ గుప్త

10)  ఇర్ఫాన్ ఉస్మా 

11)  అశుతోష్ సింగ్‌

12) మొహమ్మద్ జావిద్

 13) లావర్ యాదవ్

14) సునీల్ కుమార్

15)  వర్మ

16) బిన్ శియల. 

మరిన్ని వార్తలు