మునుగోడు ఉపఎన్నికపై ఈసీ డేగ కన్ను

2 Nov, 2022 13:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మునుగోడు ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి  పోలింగ్‌పై ఈసీ డేగ కన్ను వేసింది. హైదరాబాద్‌ ఎన్నికల కమిషన్ ఆఫీస్‌లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. 298 కేంద్రాల్లో సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సరళిని దగ్గరుండి ఎన్నికల ప్రధానాధికారి పర్యవేక్షించనున్నారు. ఎలాంటి సమస్య వచ్చిన తక్షణం స్పందించేలా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలలో టెక్నికల్ సమస్యలు వెంటనే తొలగించేలా టెక్నికల్ టీమ్‌ను అధికారులు అప్రమత్తం చేశారు.

ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకే మాక్‌ పోలింగ్‌ జరుగుతుందన్నారు. ప్రలోభాలు జరగకుండా ప్రతి గ్రామంలో తనిఖీలు చేపట్టామన్నారు. ఇప్పటివరకురూ.8 కోట్లు సీజ్‌ చేశామన్నారు.
చదవండి: లెక్క తప్పొద్దు.. పట్టు వీడొద్దు.. టీఆర్‌ఎస్‌ నేతలకు అధిష్టానం ఆదేశం

>
మరిన్ని వార్తలు