వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలు చేపట్టండి 

22 May, 2022 02:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతులు పొందిన ఉద్యోగులకు పోస్టింగ్‌ లు ఇవ్వాలని, వెంటనే సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టాలని వాణిజ్య పన్నుల శాఖ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ ముజాహిద్‌ హుస్సేన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతూకుమారి ప్రసాద్‌లకు ఫ్యాక్స్‌ ద్వారా వినతి పత్రం పంపించారు.

వాణిజ్య పన్నుల శాఖలో సుమారు 498 మంది ఉద్యోగులు పదోన్నతులు పొంది దాదాపు రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వలేదన్నారు. మరోవైపు ఐదేళ్ల నుంచి సాధారణ బదిలీల ప్రక్రియ కూడా పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.  

మరిన్ని వార్తలు