టీఎస్‌ ఎంసెట్‌: నేటి నుంచి 16 వరకు వెబ్‌ ఆప్షన్స్‌

11 Sep, 2021 08:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ ఎంసెట్‌కు సంబంధించి నేటి నుంచి 16 వరకు ఇంజనీరింగ్‌ ప్రవేశాల వెబ్‌ ఆప్షన్స్‌ ప్రక్రియ మొదలవనుంది. ఈ సందర్భంగా ఏఐసీటీఈ 161 కాలేజీలకు అనుబంధ గుర్తింపునిచ్చింది. ఇంజనీరింగ్‌ కోటాలో 85,149 సీట్లకు గానూ 60, 697 కన్వీనర్‌ కోటా సీట్లు ఉన్నాయి. ఇక అడ్మిషన్ష్‌ కౌన్సిలింగ్‌ లిస్టులో పలు ఇంజనీరింగ్‌ కాలేజీలు లిస్టులో చోటు దక్కించుకోలేదు. ఇక 91 బీ ఫార్మసీ కాలేజీల్లో 7,640 సీట్లు ఉండగా.. అందులో 2,691 కన్వీనర్‌ కోటా ఉన్నాయి. 44 ఫార్మా డీ కాలేజీల్లో 1295 సీట్లు ఉండగా.. 454 కన్వీనర్‌ కోటా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు