TS: ఇంజనీరింగ్‌ విద్యార్థుల పేరెంట్స్‌కు బిగ్‌ షాక్‌.. ఫీజుల మోత మోగింది!

5 Sep, 2022 18:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజనీరింగ్‌ విద్యార్థుల పేరెంట్స్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ ఏడాది ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఫీజులపై జీవో ఇవ్వకుండానే ప్రభుత్వం కౌన్సెలింగ్‌ను ప్రారంభించింది. 

ఈ క్రమంలో హైకోర్టు నుంచి  79 కాలేజీలు మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. TSAFRC వద్ద అంగీకరించిన ఇంజనీరింగ్‌ ఫీజులకు హైకోర్టు అనుమితి ఇచ్చింది. దీంతో, 36 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో వార్షిక ఫీజు రూ. లక్ష దాటింది. దీంతో, 10వేలు ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులపై ఫీజుల బారం పడనుంది. కాగా, రేపు(మంగళవారం) నుంచి తొలి విడత ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు జరుగనుంది. ఈ మేరకు ఈ నెల 13 వరకు ఫీజు చెల్లింపునకు ప్రభుత్వం గడువు ఇచ్చింది.

ఇదిలా ఉండగా.. సీబీఐటీలో లక్షా 73వేలు, వాసవి, వర్ధమాన్‌, సీవీఆర్‌, బీవీఆర్‌ ఐటీ మహిళా కాలేజీల్లో లక్షా 55వేలు, శ్రీనిధి, వీఎన్‌ఆర్‌ జ్యోతి వంటి కాలేజీల్లో లక్షా 50వేలపై చొప్పున ఫీజులు పెంచినట్టు సమాచారం. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో మిగతా కాలేజీలు సైతం ఫీజులను భారీగా పెంచే అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి:  రెవెన్యూలో పదోన్నతులు!

మరిన్ని వార్తలు